పూర్ణచందు సాహిత్యంపై మూడురోజుల అంతర్జాల సదస్సు

 

 

ప్రసిద్ధ సాహితీవేత్త, శతాథిక గ్రంథకర్త డాక్టర్ జి వి పూర్ణచందు  జీవితము, సాహిత్యము, వ్యక్తిత్వము అనే అంశంపై అంతర్జాల అంతర్జాతీయ సదస్సు జనవరి 1,2,3 తేదీలలో ఉదయం 10 నుండి రాత్రి 8 వరకూ జరుగుతోంది. మాడభూషి సాహిత్య కళాపరిషత్, చెన్నై వారు నిర్వహిస్తోన్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 70 మంది తెలుగు సాహితీ ప్రముఖులు పూర్ణచందు రచనలపై విశ్లేషణ చేస్తారు.

ఈ సందర్భంగా పూర్ణచందు రచనలను శ్రీ మండలి బుద్ధప్రసాద్ (హరిచరణస్మరణపరాయణ శ్రీనారాయణ తీర్థులు), ఆచార్య కొలకలూరి ఇనాక్ (పద్యరాగాలు), శ్రీ ఎల్. వి. సుబ్రహ్మణ్యం (హరహర మహాదేవ –శ్రీ అప్పయ్య దీక్షితుల జీవిత చరిత్ర), ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ (నవకరోనా నిజాలు), డా. నందమూరి లక్ష్మీపార్వతి (ముక్కాలు-7 భాషలలో వెలువడిన మినీ కవితా సంపుటి), శ్రీ మన్నం రాయుడు (భోజనభాగ్యం) ఆవిష్కరిస్తున్నారు.

జూమ్ యాప్ ద్వారా https://us02web.zoom.us/j/83517107585?pwd=UHpiK0hOc2lZdktpZnR5WEpCRlpsdz09   లింకు మీద నొక్కి ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించవచ్చు. పాస్ వర్డ్ అవసరం లేదని నిర్వాహకులు ఆచార్య మాడభూషి సంపత్కుమార్ నేడొక ప్రకటనలో తెలియజేశారు.

డా. పూర్ణచందు గత 40 సంవత్సరాల కాలంలో 129 గ్రంథాలు వెలువరించారు. తెలుగు భాషోద్యమ నిర్మాతలలో ఒకరుగా, 4 పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, 30 కి పైగా జాతీయ సదస్సులు నిర్వహించారని ఆయన తెలిపారు.

2 thoughts on “పూర్ణచందు సాహిత్యంపై మూడురోజుల అంతర్జాల సదస్సు

 • December 31, 2020 at 1:56 pm
  Permalink

  జీవి పూర్ణచందుజీ మీదు ఘన సాంద్ర ఆంధ్ర ప్రతిభ నెంచి యావ దాంధ్ర తెలుగు సాహితీ ప్రియులు మీకు నందించు హృదయ‌ పూర్వ‌కాభి నంద నములు —– *డా జె వి చలపతిరావు*💐💐🙏🙏

  Reply
 • December 31, 2020 at 1:58 pm
  Permalink

  Excellent. Right time to do it.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.