ఉద్యోగస్తుల ఆత్మబంధువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు – శ్రీ మల్లాది విష్ణు గారు
07.04.2021
విజయవాడ నగరం దానాలకు, త్యాగాలకు, స్వాతంత్ర్య పోరాటాలకు పెట్టింది పేరని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు అన్నారు. గాంధీనగర్ లోని ఎన్జీవో హోమ్ నందు శ్రీ తంగిరాల వీరరాఘవయ్య గారి విగ్రహావిష్కరణ మరియు సమావేశ మందిరాల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి శ్రీ దేవినేని అవినాష్ గారితో కలిసి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ మల్లాది విష్ణు గారు ప్రసంగిస్తూ.. విజయవాడ నగర చరిత్రలో శ్రీ తంగిరాల వీరరాఘవయ్య గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందన్నారు. తంగిరాల వీరరాఘవయ్య గారు ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని.. ఎన్టీవో సభ్యుల భవిష్యత్ అవసరాలను 1960 దశకంలోనే గుర్తించి భూమిని దానంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన దాతృత్వాన్ని గుర్తుచేసుకుంటూ.. ఎన్జీవో సభ్యులు తంగిరాల వీరరాఘవయ్య గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగస్తులే వారధులు అని శ్రీ మల్లాది విష్ణు గారు అన్నారు. అటువంటి వారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎటువంటివైనా పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉద్యోగస్తుల ఆత్మబంధువు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాగా నిలువునా మోసగించింది చంద్రబాబునాయుడి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఉద్యోగస్తులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ పదవి సంపాదించిన అశోక్ బాబు.. నేడు వారి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. స్టేట్ లెవల్ కమిటీ రిపోర్టు వచ్చిన వెంటనే పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎన్జీవోస్ నాయకులు మొహ్మద్ ఇక్బాల్, శ్రీ బండి శ్రీనివాసరావు, శ్రీ విద్యాసాగర్ రావు, 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాలి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Keywords: Jagan Mohan Reddy, NGOs, well-wisher, Malladi Vishnu