“Humans will lose livelihoods if the environment is destroyed”

World Earth Day

Amaravati, April 22:

Humans will lose their livelihoods if the environment is destroyed, said state Federation of Water Users’Association president Alla Gopala Krishna Rao .

Mr Rao was the chief guest of the World Earth Day Celebration at Rangannagudem village in Bapulapadu Mandal of Krishna District. He alone with the surpanch of the village K Rangamani planted saplings to mark the occasion.

He said by destroying environment human beings are also destroying their livelihoods. The Earth Day is observed to promote awareness about the loss of livelihoods resulting in the destruction of environment.

Report in Telugu

భూ పరిరక్షణ తోనే మానవ మనుగడ సాధ్యం.
రంగన్న గూడెం లో నిర్వహించిన ప్రపంచ ధరిత్రీ దినోత్సవం లో వెల్లడించిన రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు..
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం రంగన్న గూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి భూతాపం – భవితకు శాపం అనే నినాదంతో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, గ్రామ కమ్యూనిటీ హాల్ లో గ్రామ ప్రముఖులు రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, కో-ఆపరేటివ్ బ్యాంక్ గోడౌన్ లో ఆలపాటి సుబ్బారావు , ఊర చెరువు గట్టు వెంబడి సామాజికవేత్త పుసులూరు లక్ష్మీనారాయణ, ఎస్ఎంసి చైర్మన్ కనకవల్లి యాకోబు పంచాయతీ వార్డు సభ్యురాలు మందపాటి నాగమణి తదితరులు నీడనిచ్చే కదంబం, గానుగ, గంగరావి , వేప తదితర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహనా సమావేశం లో సామాజికవేత్త పుసులూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2021 ప్రపంచ ధరిత్రీ దినోత్సవ నినాదం భూమిని పునరుద్ధరించటం, మన భూమిని మనము పునరుద్ధరించడమే అంటే అర్థం భూమిపై మనం ,మన ఉద్యోగాలు, మన జీవన ఉపాధి ,మన ఆరోగ్యం, ఆనందాన్ని పొందడానికి ఆరోగ్యకరమైన ధరిత్రీ అవసరమని ఆయన అన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు మాట్లాడుతూ పర్యావరణం విషయంలో మనం మన బాధ్యతను విస్మరించి కూడదని, జీవవైవిధ్య పరిరక్షణ మన తక్షణ కర్తవ్యం అని అన్నారు. ప్రకృతిలోని ఇతర జీవ రాశులను మనము స్వార్థం కోసం బలి చేయకుండా వాటిని సంరక్షించినపుడే ఈ ధరిత్రీ పై మానవజాతి పదికాలాలపాటు సురక్షితంగా కాపాడ పడుతుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి మనలను మనము కాపాడుకోవాలన్నా, స్వచ్ఛమైన ప్రాణవాయువు తీసుకోవాలన్నా, సహజ వాతావరణంలో జీవించాలన్నా పెద్ద ఎత్తున మొక్కలు నాటవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని పర్యవేక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, మాజీ సర్పంచ్ మైనేని గోపాలరావు, గ్రామ ప్రముఖులు కొలుసు సాంబశివరావు, వెనిగళ్ళ శ్రీనివాసరావు, పిఎసిఎస్ కార్యదర్శి వల్లూరు వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఆలా కళ్యాణి, కనకవల్లి శేషగిరిరావు, నెరుసు తాతయ్య,మొవ్వ సాంబశివరావు,మందపాటి రాంబాబు, ఆలపాటి రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.