Govt will take stern action

Vizianagaram, Jan 3: Ministers Vellampalli Srinivas and Botsa Satyanarayana said that they were deeply saddened by the Ramatheertham temple incident and assured serious action against those responsible for the inhuman and heinous act. The ministers held a meeting with the temple authorities and priests and enquired about the incident.
Speaking after their visit to the temple here on Sunday, Minister for Endowments Vellampalli Srinivas said that Ramatheertham incident was an inhuman act, Opposition leader N Chandrababu Naidu had politicised it and blaming it on the government. During TDP rule, nearly 40 prestigious temples were demolished but today, Mr Naidu was raising the ‘Jai Sriram’ slogan to provoke the sentiments of the public.
Mr Srinivas stated that Chandrababu had no moral right to speak either on god or Hindu traditions, as he was known to offer prayers wearing shoes. Mr Naidu wanted to use the issue of temples for Tirupati by-election and local body elections, the minister said.

Minister for Municipal Administration Botsa Satyanarayana said that Mr Naidu was conspiring to create unrest in the State and to incite religious hatred, he had set up some groups to vandalize Hindu temples. He warned that destroying idols of God was an unforgivable crime and those behind the incident should be punished. The TDP leaders were intentionally alleging that the government had a role in the Ramatheertham incident and were trying to create communal disputes in the State. He said that YS Jagan Mohan Reddy led government would treat all religions equally and shall be responsible for the preservation of Hinduism.

In Telugu

03.01.2021
విజయనగరం జిల్లా, రామతీర్థం

రామతీర్థం ఆలయం సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్‌మీట్ పాయింట్స్..

– రాజకీయ భవిష్యత్తే లేని చంద్రబాబు.. ఖబడ్దార్‌ అని నోటికొచ్చినట్లు మాట్లాడతారా..?ః శ్రీ బొత్స సత్యనారాయణ

– దేవుళ్ళపై దాడులు చేసే వారు అసలు మనుషులేనా.. ఈ పాడు పని చేయించినవాళ్ళు మానవ జన్మ ఎత్తేరా..?

– సమాజం కోసం కాకుండా.. తన సామాజికవర్గం కోసం ఆలోచించే వ్యక్తి నాయకుడా..?

– చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు… రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం ఉంది

– దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరం… డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు అలవాటే

– సీఎం పర్యటనకు ముందు రోజే టీడీపీ కుట్ర చేసింది.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించాలనే కుట్ర

– ఇలాంటి నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు భాష చూస్తేనే అసహ్యం వేస్తుంది

– మాన్సాస్ ట్రస్ట్‌ స్థలాలను మురళీమోహన్ లాంటి నాయకులకు కట్టబెట్టింది వాస్తవం కాదా?

– ఆలయాలను కూల్చిన చంద్రబాబుకు సంప్రదాయాలు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..?ః మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్

– చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా?

– సీఎం శ్రీ వైయస్ జగన్ పరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. సీఎంపై గౌరవం లేకుండా మాట్లాడతారా?

– దేవుడు ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు

– మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా బాబు లబ్ది పొందాలని చూస్తున్నారు, దేవుడంటే బాబుకు నమ్మకం లేదు

– రామతీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

మంత్రి శ్రీ బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ…ఏమన్నారంటే..

1- జరిగిన సంఘటన పట్ల ఈ ప్రాంత వాసిగా, ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రిగా ఎంతో బాధపడుతున్నానని బొత్స అన్నారు. మనుషుల్ని కొట్టుకోవటం, తిట్టుకోవటం చూశాం. దైవత్వాన్ని సాక్షాత్తూ మనందరికీ దైవమైన శ్రీరామచంద్ర ప్రభువుని ఈరకంగా చేసిన విధానం చూస్తే చేసిన వాడు మనిషేనా? చేయించినవాడిది మానవజన్మేనా అనిపిస్తుంది. ఇది క్షమించరాని నేరం. దీనికి శిక్షతప్పదు. ఈరోజుకి.. ఈ గంటకి ఈ కార్యక్రమం చేసినవారు ఆనందపడొచ్చు. కానీ దానికి ప్రాయశ్చిత్తం తప్పదు. రామాయణం విన్నాం. ఏ విధంగా దుష్టశిక్షణ చేశారో.. ఆ రకంగా ఈపని చేసిన వారికి శిక్ష తప్పదు.

2- శ్రీ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు విని.. సీఎం అయిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేక అధికారం కోల్పోయి ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎం జగన్ గారిని ఎంత మాట అంటే అంతమాట అంటున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడ్ని తండ్రీకొడుకులు (చంద్రబాబు, లోకేశ్‌) ఇష్టారాజ్యంగా ఏవిధంగా మాట్లాడుతున్నారో, ట్వీట్లు చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తుంటే దానికి ఒక రోజు ముందో, ఒక రోజు తర్వాత ఏదో ఒక ఆటంకాన్ని సృష్టించటమో, ఏదో గందరగోళం చేయటమో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమో చేస్తున్నారు.

3- ఈ రామతీర్థం ఘటనకు టీడీపీకి సంబంధం ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల లబ్దిపొందేది ఎవరు? ఎక్కడైనా కొట్లాట, తిట్లాట, హత్య జరిగితే వాటి వల్ల లబ్దిపొందేది ఎవరో ఒకరు ఉంటారు. రాష్ట్రంలో ఎలాగైనా మత కల్లోలాలు సృష్టించాలని, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లా ప్రజలు ఎంతో శాంతియుతంగా ఉంటారు. అన్ని పార్టీల నాయకులు కూడా ఎంతో చక్కగా ఉంటారు. నిన్న మా పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయిరెడ్డి రామతీర్థం వస్తున్నారని తెలిసి ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. తద్వారా అల్లకల్లోలం సృష్టించి చంద్రబాబు దాన్ని రాజకీయం చేయాలని చూశారు. చంద్రబాబు వచ్చి చూస్తే ఏంటి; చూడకపోతే ఏంటీ? రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయించిందే చంద్రబాబే. పైగా నంగనాచిలా వచ్చి చంద్రబాబు మాట్లాడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

4- సాక్ష్యాలు, రుజువులు కచ్చితంగా బయటకు వస్తాయి. చేయి అడ్డుపెడితే సూర్యోదయం ఆగిపోతుందనుకుంటే పొరపాటు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో 31 లక్షల మందికి సీఎం శ్రీ జగన్ ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రారంభించి కాకినాడ, కాళహస్తి, విజయనగరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ దుశ్చర్య చేశారు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఉందని బొత్స ప్రశ్నించారు.

5- రాష్ట్రంలో ఇలాంటి తుచ్ఛమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే అని బొత్స మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు ఆలోచనలు చూశామని బొత్స తెలిపారు. రాజకీయ భవిష్యత్‌ లేని చంద్రబాబే.. ఖబడ్దార్‌ అనటం ఏంటని దేనికి ఖబడ్దార్‌ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని, సెంటిమెంట్లు అడ్డంపెట్టుకొని చంద్రబాబు తప్పులు చేస్తున్నారు.

6- సీఎం శ్రీ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చిన్న వయస్సులోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూసి పెద్దలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సీఎం శ్రీ జగన్ గారి పరిపాలనను చూసి ఓర్వలేకపోతున్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడిన భాష చూస్తే.. అసహ్యం వేసిందని అన్నారు. మైక్‌ పట్టుకున్నాం కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సంప్రదాయం కాదన్నారు.

7- కర్నూలులో ఆంజనేయుల విగ్రహం ధ్వంసం చేశారని పుకార్లు సృష్టించారు. ఎస్పీ స్వయంగా వెళ్లి చూశారు. అక్కడ అలాంటిది ఏమీలేదని బొత్స అన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం మూడు రోజుల ముందు ఓ కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం ముందు ఓ కార్యక్రమం.. ఇలా ప్రభుత్వ పథకాలు ప్రారంభించేటప్పుడు ఇటువంటి ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడటం ప్రజలను డైవర్ట్ చేయడం చంద్రబాబు అండ్ కో.. కు అలవాటుగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు బాధ్యుల్ని పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నా కూడా.. కావాలని దురుద్దేశాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు.

  • అశోకగజపతిరాజు ఆస్తుల్ని దోచుకోవటానికి వచ్చామని రామతీర్థంలో చంద్రబాబు మాట్లాడటంపై బొత్స మండిపడ్డారు. దేశంలో సంస్థానాలు, రాజభరణాలు రద్దు చేశారు. ఇక్కడున్న విజయనగరం సంస్థానం ప్రభుత్వానికి దఖలు పడకూడదని వారి వారసులు దీన్ని హక్కుగా భావించాలని వీళ్ల తాత, ముత్తాత చేసిన ఘనకార్యం వల్ల ఈనాటికీ వాళ్లకు అన్నం పెడుతోంది. ఇది వాస్తవం కాదా? వాళ్లను చెప్పమనండి.

8- ఇది వాళ్ల (గజపతి) కుటుంబ కలహాలు కదా అని మేం ఇంతకాలం మాట్లాడటంలేదు. సాక్షాత్తూ చంద్రబాబే వచ్చి మాట్లాడారు కాబట్టి దైవసాక్షిగా మాట్లాడాల్సి వచ్చిందని బొత్స అన్నారు. ఏరకంగా మాన్సాస్ ట్రస్ట్‌ స్థలంలో మురళీమోహన్ వంటి నాయకులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇదేనా సంస్థను బాగుపరచటం అంటే? ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌ ఎవరు? బాధ్యతలేదా ఆయనకు? ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌ను అలంకారం కోసం వేస్తారా? అధికారం నిరూపించుకోవటానికి వేస్తారా? ఆ దేవాలయం ఆలనాపాలనా చూసుకోవటానికి వేస్తారా అని బొత్స ప్రశ్నించారు. మా మీద బురదచల్లి కడుక్కోమంటారు. ఇంతకాలం సంయమనం పాటించాం. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అంటే భరించటానికి చూస్తూ ఊరుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని బొత్స హెచ్చరించారు. చంద్రబాబు, ఆయన కుమారుడుకు కూడా ఇదే విషయం చెబుతున్నాము. ట్విట్టర్‌లో వారి భాష సక్రమంగా లేదన్నారు.

9- చంద్రబాబు కొడుకు ఒక లోఫర్ అని.. ఒక సోమరిపోతు, పనికిమాలిన వ్యక్తి అని బొత్స మండిపడ్డారు. సీఎంను ఎంత మాట అంటే అంత మాట అంటారా? ప్రజాస్వామ్యంలో, వాక్‌స్వాతంత్ర్యం ఉంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ఇలాంటి లోఫర్‌లు ఉండబట్టే.. ప్రజల చేత ఎన్నికైన వ్యక్తులకు గౌరవం తగ్గుతోందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారంతో శాంతిభద్రతలు పరిరక్షించుకుంటూ, మతసామరస్యం కాపాడుకుంటూ…అన్ని వర్గాల సంక్షేమం చూసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని బొత్స అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ సీఎం శ్రీ జగన్ గారి పరిపాలన జరుగుతోంది. అవి చూసి ఓర్వలేని చంద్రబాబు లాంటి వెన్నుపోటుదార్లు ఏం చేసినా ఇతనితో లాభం లేదని ఇలాంటి అకృత్యాలు ప్రోత్సహిస్తున్నారు. నిన్న శ్రీ విజయసాయిరెడ్డి గారి కారుపై రాళ్లు ఎందుకు వేయాల్సి వచ్చింది. నిన్న మేం పిలుపు ఇస్తే ఏరకంగా జరిగేదో చంద్రబాబుకు తెలీదా అని బొత్స నిలదీశారు. వ్యక్తిగతంగా అవమానం జరిగినా తలదించుకుంటూ సంయమనం పాటించామన్నారు. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నామని మన ఊరుకు వచ్చారని గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని బొత్స తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని మేం అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మా కార్యకర్తలకు హితవు పలికామన్నారు. ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించి లబ్ధిపొందాలని చంద్రబాబు, టీడీపీ వారు చూశారని బొత్స అన్నారు.

10- రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో అశోకగజపతిరాజు అండ్ కో కలిసి ఏ కార్యక్రమం చేశారో అందరూ చూశారన్నారు. ఏరకంగా లబ్ధి పొందాలో చూశారన్నారు. సుమారు ఐదు సంవత్సరాలు ఏ సెక్షన్లు పెట్టుకొని పరిపాలించారో చూశాం. ఈరోజు నీతికబుర్లు చెబుతూ నీతిమంతులం అని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని చెబుతున్నాం. మాకూ నోరు ఉంది. మాకూ వాక్‌ స్వాతంత్ర్యం ఉంది. ప్రజాస్వామ్యంలో మా అందరికీ మాట్లాడే హక్కు ఉందని మీ పరిధిలో మీరు మాట్లాడితే.. మా పరిధిలో మేం మాట్లాడతామని బొత్స అన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలు.. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక తెలుగుదేశం, చంద్రబాబు ఆయన తాబేదార్ల హస్తం ఉందన్న సంగతి నిరూపిస్తాం. చంద్రబాబుకు రాజకీయాలలో ఉండటానికే అనర్హుడు అన్నారు.

11-రామతీర్థంలో ప్రతి అభివృద్ది కార్యక్రమం మహానేత వైయస్‌ఆర్ హయాంలోనే జరిగిందని, ఏనాడైనా చంద్రబాబు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా చేశారా బొత్స ప్రశ్నించారు. ఏనాడైనా ఈ దేవాలయానికి వారు వచ్చారా;? శ్రీరామనవమి జరిగిన ప్రతిసారీ ఈ దేవాలయానికి వచ్చాం. భద్రాద్రి తర్వాత శ్రీరామనవమిని ఇక్కడ చేయాలని చంద్రబాబును కోరాం. ఆనాడు చంద్రబాబు చేశారా? పక్కన కూర్చొన్న అశోకగజపతిరాజు అయినా మనం ఏమీ ఈ దేవాలయానికి చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదా? ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పమనండి. కాదు.. దేవాలయానికి నేను ఇది చేశానని అశోకగజపతిరాజు ఒక చిట్టాను ఇవ్వమనండి అని బొత్స సవాల్ విసిరారు. దేవుడి పట్ల మాకు భక్తి ఉంది. మేం కూడా హిందువులమే. ఈ ప్రాంతంలో పుట్టాం.. ఈ ప్రాంతంలో పెరిగాం.. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. మా మాటను సీఎం మన్నిస్తున్నారు. అభివృధ్ధి చేస్తున్నాము. ఎంతో ధైర్యంగా ఈ విషయం చెబుతున్నాము.

12- చంద్రబాబు నిన్న ఇక్కడకు వచ్చి ఏదోదో చెబుతారు. ఇక్కడకు వచ్చి అమరావతి గురించి మాట్లాడతారు. అమరావతిలో దోచుకొని తిన్నారు. నాయకత్వం ఇస్తే సమాజం గురించి ఆలోచన చేయాలి కానీ సామాజిక వర్గం కోసం ఆలోచన చేస్తారా? ముఖ్యమంత్రి అంటే కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని భగవద్గీత, రాజ్యాంగం సాక్షిగా ప్రమాణస్వీకారం చేసి వస్తారు. ఇవన్నీ మర్చిపోయి సమాజశ్రేయస్సు మర్చిపోయి సామాజిక శ్రేయస్సు, సామాజిక అభివృద్ధి కోసమని అమరావతిపై చంద్రబాబు మాట్లాడతారు. విశాఖపట్నం, భోగాపురం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. భోగాపురంను విభజన చట్టంలోనే పెట్టారని మరి ఐదేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టును ఎందుకు తేలేకపోయారు. సాక్షాత్తూ ఆనాడు కేంద్రమంత్రి మీపార్టీ వ్యక్తి అశోకగజపతి రాజే ఉన్నారు. మరి, ఆయన ఐదేళ్లు ఏం చేశారు. ఎందుకు కట్టలేకపోయారు. సాక్షాత్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థే టెండర్ వేస్తే దాన్న అనర్హత చేసిన ఘనత ఏ మంత్రికీ ఉండదన్నారు. ఆయన నీతి మంతుడు అంట. ఆయనకంటే మూడింతలు మేం నీతిమంతులం. మేం నీతిమంతులం కాదని నిరూపించమనండి. గురివిందకు మచ్చ తెలీదన్నట్లు వ్యవహరించవద్దు..

13- విజయవాడలో దేవాలయాలను ఎవరు ధ్వంసం చేశారు? రోడ్డు వెడల్పు కోసం దేవాలయాలను ఆగమన శాస్త్రం ప్రకారం ఒప్పించి తీస్తారు. మొన్న దేవాదాయ శాఖ మంత్రి, నేను వెళ్లి ఎలా పునర్‌నిర్మించాలో కార్యచరణపై చర్చించటం జరిగిందన్నారు. విజయవాడలో జరిగింది విజయనగరంలో తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారా? వాట్సాప్‌లు వచ్చాయన్న సంగతి చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నారు. విజయనగరంలో ప్రతిచోట అభివృద్ధి చేసిన శిలాఫలకాలు ఉంటాయి. వెళ్లి చూస్తే.. ఎవరు విజయనగరం జిల్లాను అభివృద్ధి చేశారో తెలుస్తుంది.

14- మత సామరస్యానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. అన్ని మతాలను సమానంగా చూడాలని ఏ మతాన్ని కూడా కించపరచకూడదని ఏ మతస్తుడు కూడా కలత చెందకూడదని హిందూ మతం పరిరక్షణ బాధ్యతగా చేసుకువస్తున్నామని బొత్స అన్నారు. రామతీర్థం ఘటనకు కారకులు ఎవరో, ఈ ఘటన వెనుక ఉన్న దోషుల్ని అందర్నీ చట్టం ముందు నిలబెడతామని బొత్స స్పష్టం చేశారు.

15- ఈ అపచారానికి పరిహారం ఎలా చేయాలో.. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి పీఠాధిపతులతో మాట్లాడారన్నారు. విజయవాడకు వెళ్లిన తర్వాత దీనిపై కార్యాచరణను వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటిస్తారన్నారు.

దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే
1- రామతీర్థం ఘటన ఎలా జరిగిందో కమిషనర్, ఇతర అధికారులతో సమీక్ష జరిపామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటన ఏవిధంగా జరిగింది.. ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి చర్యలు తీసుకోవాలనే దానిమీద బొత్స సత్యనారాయణ, దేవాదాయ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించామని వెల్లంపల్లి అన్నారు. ఘటన జరిగిన విధానం చూసి చాలా బాధ కలిగిందని ఆలయం చూసిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఏ మనిషి కూడా చేయకూడని పాడు పని ఇదన్నారు. మనిషి వేషంలో ఉన్న మృగం చేసే విధంగా ఈ చర్య ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

2- రామతీర్థం ఒక ప్రత్యేక దేవాలయమని.. దీనికి మంచి ప్రతిష్ట ఉందన్నారు. ఏదైతే కొండ మీద రాములవారి దేవాలయం ఉందో… అది ఏకాంతంగా ఉండటంతో కొంతమంది దుండగులు రాత్రి పూట దొడ్డిదారిన దేవాలయానికి వచ్చి రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేసే విధంగా వ్యవహరించటం సరికాదని చంద్రబాబుపై వెల్లంపల్లి మండిపడ్డారు.

3- గతంలో విజయవాడలో 40 దేవాలయాలను అడ్డగోలుగా, దుర్మార్గంగా కూల్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడికి వచ్చి చాలా నీతి కబుర్లు చెప్పారు. ఇది ఎలా ఉందంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని చంద్రబాబుపై వెల్లంపల్లి మండిపడ్డారు. ఈరోజే చంద్రబాబుకు జ్ఞానోపదేశం అయిందేమో.. ఈరోజే జైశ్రీరామ్ గురుకొచ్చారు. ఇంతకు ముందు దేవాలయాలు కూలగొట్టినప్పుడు చంద్రబాబుకు దేవుడు గుర్తుకు రాలేదా అని వెల్లపల్లి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా పారదర్శకంగా వెళ్లటం జరుగుతోందని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

4- దేవాలయాల అభివృద్ధి గానీ… దేవాలయాల ఆస్తులను పరిరక్షించడంలో పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు వెళ్లటం జరుగుతోందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో దుర్మార్గంగా దేవాలయాలన్నీ కూల్చడం, గోశాలలు కూల్చేయడం, దేవాలయాల ఆస్తులన్నీ వాళ్ళ బినామీలకి ధారాదత్తం చేయడం చేశారు.

5- నిన్న రామతీర్థం వచ్చిన చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి గారిపైన, ప్రభుత్వంపైన బురదజల్లే విధంగా… చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. నేను హిందువులు అందరికీ ఒక్కటే చెబుతున్నాను. మనందరం ఎంతో సంయమనంతో ఉండాలి. దేవాలయాల పరిరక్షణ అనేది ప్రతిఒక్కరి బాధ్యత. ప్రతి గుడి మనం బాధ్యతతో చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసే విధంగా, ఏదో ప్రభుత్వానికి ఆపాదించే విధంగా చేయడం చాలా బాధాకరమన్నారు.

6- చంద్రబాబుకి రాజకీయం అవసరం కనుక ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. రేపు స్థానిక ఎన్నికలు వ‌స్తున్నాయ‌నో, తిరుపతిలో ఉప ఎన్నికలు వ‌స్తున్నాయ‌నో చంద్రబాబు కావాలని ఇటువంటి కుట్రలు చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. మొన్నటిదాకా కులాలకి, మతాలకి మధ్య చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేశాడు. అది చంద్రబాబు వల్ల కాలేదు. ఇవాళ మతం అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తున్నారు.

7- నిన్న విశాఖపట్నంలో దిగిన దగ్గర నుంచి చంద్రబాబు తీరును గమనించాలని వెల్లంపల్లి కోరారు. విక్టరీ సింబల్, థమ్ సప్ సింబల్స్‌ చూపించడం చేశారు. వచ్చిన పర్యటన ఏంటి? దేనికి చంద్రబాబు విక్టరీ..? వచ్చిన కార్యక్రమం ఏంటనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఈ విషయాన్ని పట్టుకొని రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ప్రయత్నించారు. అసలు చంద్రబాబుకు దేవుడు అంటే నమ్మకం ఉందా? హిందూ సంప్రదాయాలు పట్టించుకునే అలవాటు ఉందా. బూట్లతో పూజలు చేసినవాడివి, హిందూ దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబా.. దేవాలయాలు, హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడేదని వెల్లంపల్లి ప్రశ్నించారు.

8- అధికారులు అందరితో సంప్రదించి మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని దేవాలయం అభివృద్ధి చేయటంపై చర్చిస్తామన్నారు. అంతేకాకుండా సంప్రోక్షణతో పాటు ఆగమ సలహాలు తీసుకొని గుడి పవిత్రత కాపాడటం కోసమే ఇక్కడకు రావటం జరిగిందని వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. పోలీసు వ్యవస్థ కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తారని శ్రీరామచంద్రుడుకు అవమానం చేసిన వారు పాపం అనుభవిస్తారని వెల్లంపల్లి హెచ్చరించారు.

9- అలిపిరి ఘటన నుంచి బయటపడ్డానని చంద్రబాబు చెబుతున్నారు. వేంకటేశ్వరస్వామి దీవించారని అంటున్నారు. వేంకటేశ్వరస్వామి దీవిస్తే ముఖ్యమంత్రి అయ్యేవారు.. పాపాలు చేశారు కాబట్టి ఓడిపోయారని వెల్లంపల్లి అన్నారు. ఈ ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని తెలిస్తే శ్రీరామచంద్రుడి ఆగ్రహానికి గురికావటం ఖాయమని వెల్లంపల్లి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.