“CJI is son of the soil from Agri family”

Amaravati, April 25:

It is a matter of pride that the new Chief Justice of India Nuthalapati Venkata Ramana is the son of a farmer and is native to Krishna district, said Andhra Pradesh Water Users’ Associations Federation President Alla Venkata Gopala Krishna Rao.

Speaking to the media here on Sunday Mr Rao said that the Chief Justice hails from Ponnavaram village in Veerulapadu mandal of Krishna district. The village which was in upland area was in the Third zone of Nagarjuna sagar left canal.

Mr Rao said that it was a matter of pride to the farmers and the people of the area. Justice Venkataramana had become the Chief Justice of India by sheer hard work and commitment.

(More in Telugu)

 

రైతుబిడ్డ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా అయినందుకు తెలుగు జాతి కి గర్వకారణం

సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు..

భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కృష్ణా జిల్లా వాసి తెలుగు తేజం జస్టిస్ నూతలపాటివెంకటరమణ గారు నిన్న ఉదయం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇదే విషయమై ఈరోజు ఉదయం విజయవాడ లోని నీటిసంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ లోని ఆయకట్టులో ఉన్నవీరులపాడు మండలం పొన్నవరం లో జన్మించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు 1983లో ఆంధ్రప్రదేశ్ లో బార్ కౌన్సిల్ లోసభ్యులుగా చేరిన నాటి నుండి నేటి వరకు 38 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో, అంకిత భావంతో పనిచేసి పనిచేసి నేడుసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక రైతు బిడ్డ ప్రమాణ స్వీకారం చేయడం రైతు లోకానికి ఆనందదాయకం అన్నారు. “న్యాయస్థానంఅంటే ఒక దేవాలయం అందులో ఉన్నది ధర్మదేవత తాను నల్లకోటు ధరించడం అంటే ఆ ధర్మదేవతకు ప్రతినిధిగాప్రవర్తించడమే”న్యాయం విషయంలో వివక్షకు తావులేదు, లింగ వివక్షకు తావులేదు, అయితే స్త్రీల విషయంలో మానవీయ కోణంతోఆలోచించాలి అని వారు చేసే త్యాగాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని బలంగా నమ్మే వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గారుఅని అన్నారు.

స్వేచ్ఛ, సమానత్వాలు మనిషికి ఎంత అవసరమో , బాధ్యత కూడా అంతే అవసరమని, ప్రతి పౌరుడి బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తిస్తేన్యాయవ్యవస్థకు కొంచెం శ్రమ తగ్గుతుందని భావించే ఆయన సారథ్యంలో మన న్యాయ వ్యవస్థ మరింతగా ప్రజలకు చేరువఅవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.