జ‌నం క‌ష్టాల్లో వుంటే ఆస్తి ప‌న్నులు, చెత్త‌పై ప‌న్ను భారాలు వేయ‌డం దుర్మార్గం

– సిహెచ్‌.బాబూరావు, ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ట‌ణ పౌర స‌మాఖ్య రాష్ట్ర క‌న్వీన‌ర్‌.

చెత్త‌ప‌న్ను, ఆస్తిప‌న్ను పెంపు అమ‌లు ఉప‌సంహ‌ రించుకోవాలి.

దీనిపై అన్ని మున్సిపాలి టీల‌లో .పి.యు.సి.ఎఫ్‌.గా విన‌తులు,ఆందోళ‌న‌లు చేస్తాం.

జ‌న‌మంద‌రూ కోవిడ్ క‌ష్టాల్లో వుంటే గుట్ట చ‌ప్పుడు కాకుండా ఆస్తిప‌న్ను, చెత్త‌పై ప‌న్నుల భారాల‌ను ప్రజ‌ల‌పై మోపి, వాటి అమ‌లుకు పూనుకోవడం స‌మంజ‌సం కాద‌ని, ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ట‌ణ పౌర‌స‌మాఖ్య రాష్ట్ర క‌న్వీన‌ర్ సిహెచ్‌.బాబూరావు అన్నారు. బుధ‌వాంర ఉద‌యం స్ధానిక ఎం.బి.కె.లో జ‌రిగిన ప‌త్రికా విలేఖ‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

👉 క‌రోనాతో జ‌నం పిట్టాల్లాగా రాలిపోతున్నారు. ఆసుత్రులు ఖాళీ లేవు. కేసులు త‌గ్గాయ‌ను కుంటున్నా, తీవ్ర‌త ఎక్క‌డా త‌గ్గ‌లేదు. రోజూ 100మంది చ‌నిపోతున్నారు.

👉 ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వ‌డ‌మే కాదు, వారి ఆర్ధిక వ్య‌వ‌స్థ అత‌లాకుతలం అయిపోయింది. ఉపాది కోల్పోయారు. కోవిడ్ బాధితులు 14రోజుల్లోనే కోలుకున్నా, త‌రువాత‌ 3నెల‌ల వర‌కు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి.
ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జీవితాల‌న్నీతారుమారవుతున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదు.

👉 మోడీ ప్రభుత్వం పూర్తిగా రాజ‌కీయాలు, రాష్ర్టాల్లో అదికారాల కైవ‌సం చేసుకోనే ప‌నిలో వుంది త‌ప్పా మ‌రొక‌టి లేదు.

👉 రాష్ట్రప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి గారు కోవిడ్‌తో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని చెప్పి ఊరుకుంటే స‌రిపోదు. ప్ర‌భుత్వ బాధ్య‌త పెర‌గాలి. గ‌త సంవ‌త్స‌రం కుటుంబానికి ఒక‌నెల 1000రూపాయ‌లలు ఇచ్చారు, ప్యాకేజీలు ప్ర‌క‌టించారు. ఇసారి అదికూడా లేదు.

👉 ప్ర‌స్తుతం రాష్ట్రప్ర‌భుత్వం కోవిడ్‌తో ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న ప్యాకేజీ ఏమిటంటే చెత్త‌పై ప‌న్ను విధించ‌డం, ఆస్తి విలువ ఆధారంగా ఇంటి ప‌న్ను పెంచ‌డం.

👉 ప్ర‌తి మున్సిపాలిటి నుండి కార్పోరేష‌న్ వ‌ర‌కు దాదాపుగా సంవ‌త్స‌రానికి 750రూ.. నుండి 1450రూపాయిల వ‌ర‌కు ప‌న్ను పెంచి, చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని చెత్త‌ప‌న్నును విధిస్తోంది.

👉 మున్సిపాలిటీల‌లో 60రూ, స్పెష‌ల్ గ్రేడ్ మున్సిపాలిటీల‌లో 90రూ, కార్పోరేష‌న్‌లో నెల‌కు 120రూ ప్ర‌తి కుటుంబానికి పెంచుతూ (అద్దెల‌కు ఉండే వారితో స‌హా) నోటీసులు జారీ చేయ‌డం దుర్మార్గం.

👉 ఈ రంకంగా 50ల‌క్ష‌ల కుటుంబాల‌కు నెల‌కు 60-120 రూపాయ‌ల వ‌ర‌కు 3గ్రేడ్‌లుగా వ‌సూలు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పూనుకుంది.

👉 చెత్త‌పై ప‌న్ను వేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిగ్గుప‌డాలి. పారిశుద్యాన్ని, ప్ర‌జారోగ్యం ప‌ట్టించుకోవ‌డాన్ని గాలి కోదిలేసి, క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం మానేసి, చెత్త‌పై ప‌న్ను వేయ‌డం గ‌ర్హ‌ణీయం.

👉 చిన్న మున్సిపాలిటీల నుండి పెద్ద కార్పోరేష‌న్ల వ‌ర‌కు ఎవ‌రి వ‌ద్ద ఎంత వ‌సూలు చేయాలో మొద‌టి కౌన్సిళ్ళ‌లోనే పెట్ట‌డం దారుణం

👉 ఆస్తివిలువ ఆధారంగా ఇంటి ప‌న్ను పెంచ‌డానికి అనంతపురం మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వారు నోటీసు ఇచ్చారు. అనంత‌పురం కోవిడ్‌తో అల్లాడుతుంటే ప్ర‌జ‌ల‌కు ఏమిచేయాలో మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఆలోచ‌న చేయ‌కుండా ప‌న్నులు ఎలా పెంచాలో ఆలోచిస్తున్నాయి. కొన్ని చోట్ల అమ‌లు చేస్తున్నారు.

👉 కోవిడ్‌తో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే ప్ర‌భుత్వాలు ప‌న్నులు వేయ‌డంలో బిజీగా వున్నాయి. దీంట్లో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికీ బాధ్య‌త వున్న‌ది. స్వ‌చ్ఛ‌భార‌త్ పేరుతో ప‌న్నులు ఎంత‌ఎక్కువ వ‌సూలు చేస్తే అంత అవార్డు. అవార్డుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల జేబులు ఖాళీ చేసే ప‌నిలో వుంది. ఇంత‌కంటే దారుణం ఇంకోక‌టి లేదు.

👉 రాష్ట్రంలో కోటి యభై ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌పై ఈ భారం ప‌డుతుంది. యాభైలక్ష‌ల కుటుంబాల‌పై ఈభారం ప‌డుతుంది. కోవిడ్‌ క‌ష్టాల్లో ప్ర‌జ‌ల‌ను శాస‌న స‌భ్యులు, కౌన్సిల్ కూడా ప‌ట్టించు కోకుండా గాలికొదిలేశారు.

👉 ఆసుప‌త్రులు నిర్మాణం, పారిశుద్యం, వేస‌విలో మంచినీటి ఎద్ద‌డి ఎలా అరిక‌ట్టాలి, కోవిడ్‌లో శానిట‌రీ సిబ్బంది పెంపు వంటి విష‌యాలు ప‌ట్టించుకోవ‌డం మానేసి, ఈ రంకంగా ప‌న్నులు పెంచ‌డం స‌రికాదు.

👉 మార్చిలో ముఖ్య‌మంత్రి స‌మీక్షా స‌మావేశం జ‌రిపి, చెత్త‌ప‌న్ను-ఆస్తిప‌న్ను ఈ విధంగా పెంచ‌మ‌ని ఆదేశాల‌కు లోబ‌డి అమ‌లు చేయ‌డానికి మున్సిప‌ల్ శాఖ పూనుకున్న‌ది.

👉 పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జారోగ్యాన్ని కాపాడటం ప్ర‌భుత్వాలు, స్ధానిక సంస్థ‌ల భాధ్య‌త నుండి త‌ప్పుకుని, ప్ర‌తిప‌నికీ డ‌బ్బులు వ‌సూలు చేస్తూ మున్సిపాలిటీల‌ను వ్యాపార సంస్థ‌ల్లా ప్ర‌భుత్వం మార్చేయ‌డం దుర్మార్గం.

👉 ఈ కోవిడ్ స‌యంలో వ్యాపారాలు లేక‌, ప‌నులు, ఉపాధి లేక ప్ర‌జ‌లు వ‌డ్డీలు, ప‌న్నులు ర‌ద్దు చేయ‌మ‌ని అడుగుతుంటే ఉన్న వాటిని పెంచ‌డం సిగ్గు.

👉 ప్ర‌జారోగ్యాన్ని కాపాడమ‌ని, ప‌ట్ట‌ణాల్లో స‌దుపాయాలు పెంచ‌మ‌ని మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వై.సి.పి.కి అత్య‌ధిక మెజార్టీ ఇస్తే, అందుకు భిన్నంగా ప‌న్నుల దాడి ప్రారంభించడం శోచ‌నీయం. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తాని వైసిపిని గెలిపిస్తే, ప్ర‌జ‌ల‌పై భారాలు మోపి జేబులు కొట్ట‌డం గ‌ర్హ‌ణీయం.

👉 అధికార‌పార్టీ కార్పోరేట‌ర్లు కూడా ప్ర‌భుత్వం చెప్పిన‌దానిని గుడ్డిగా న‌మ్మ‌డం స‌రైంది కాదు. ఈ ప‌న్నుల భారాలను వ్య‌తిరేకించి ప్ర‌జ‌ల త‌రపున నిల‌బ‌డ‌తారో, లేదా మీ పార్టీల త‌ర‌పున నిల‌బ‌డ‌తారో తేల్చుకోవాలి.

👉 ఒక ప్ర‌క్క ప్ర‌జ‌ల జేబులు కొల్ల‌గొడుతూ, సంక్షేమ రాజ్యం గురించి చెప్ప‌డం స‌మంజ‌సం కాదు. ప్ర‌జ‌లు కోరుకున్న సంక్షేమ రాజ్యం ఇదికారు. భారాలు లేని సంక్షేమ‌రాజ‌ర్యం కోసం మిమ్మ‌ల్ని అధికారంలోకి తెచ్చారన్న సంగ‌తి గ‌మ‌నించాలి.

👉త‌ క్ష‌ణ‌మే చెత్త‌ప‌న్ను అమ‌లును ఉప‌సంహ‌రించాలి. ఇంటిప‌న్న‌లు పెంచే నోటిఫికేష‌న్ల‌ను ర‌ద్దు చేయాలి.

👉 వీటిపై రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ట‌ణ పౌర స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో విన‌తిప‌త్రాలు ఇస్తాము. కోవిడ్ నిబంద‌న‌ల‌కు లోబ‌డి ఆందోళ‌న‌లు చేస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.