ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రజలపై ఆస్తి పన్నుల భారాన్ని మోపుతున్న ప్రభుత్వం

చెత్త పన్ను వసూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం, ఇక ఆస్తి విలువ ఆధారిత పన్ను వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న విజయవాడ నగర పాలక సంస్థ, ఆస్తి పన్ను పెంపులో రాష్ట్రంలోనే ముందంజలో ఉంది.

28వ తేదీన జరగనున్న విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి

లేనియెడల ప్రజా ప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు

నేడు విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, జిల్లా నేత డి. కాశీ నాథ్, ఫ్లోర్ లీడర్ బి. సత్యబాబు పాల్గొన్నారు.

బాబూరావు మాట్లాడుతూ…..

✍️ కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై ఆస్తి పన్ను భారాన్ని మోపడానికి ప్రయత్నించటం గర్హనీయం.

😡 కనీస కనికరం, మానవత్వం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీల్చి పిప్పి
చేస్తున్నాయి.

🎙️ ప్రజల అభ్యంతరాలను, సలహాలను భేఖాతరు చేస్తూ విజయవాడ నగర పాలక సంస్థ ఆస్తి విలువ ఆధారిత పన్నును ఆమోదించడానికి ప్రతిపాదన పెట్టడం శోచనీయం.

📋 వేల మంది ప్రజల అభ్యంతరాలు పెట్టినా ఒకరి సలహా కూడా సహకరించకపోవడం ఆక్షేపణీయం.

⚓ ఈ విధానం వల్ల ప్రజలను శాశ్వతంగా పన్నుల
ఊబిలోకి నడుపుతున్నారు.

🗣️ 100 నుండి 1000 శాతం వరకు ఇంటి పన్నులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇక పన్నులు పెరగటం ఖాయం.

👊రాష్ట్రంలోనీ అన్ని నగరపాలక సంస్థల కంటే ముందుగానే ఆస్తి విలువ ఆధారిత పన్నును ఆమోదించి ముఖ్యమంత్రి మెప్పు పొందాలని అత్యుత్సాహం చూపుతున్న విజయవాడ నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు.

✌️గత ప్రభుత్వాలు పన్నులు పెంచి ప్రజలను పీడించాయని చెప్పిన వైయస్సార్ పార్టీ నేడు 20 సంవత్సరాల నుండి ఇంటి పన్ను పెంచలేదు కాబట్టి, ఆ మొత్తాన్ని ఇప్పుడు పెంచుతున్నామని చెప్పటం సిగ్గుచేటు.

🤬 పేదలకు సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే పన్ను వసూలు చేస్తామని చెప్పే మాట మోసపూరితం.

🏘️ 40 చదరపు గజాల లోపు నిర్మించిన ఇళ్ళకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు ఇళ్లు కూడా 50 గజాల వరకు ఉంటాయి, వారికి కూడా ఈ రాయితీ వర్తించదు.

🛖 మరోవైపు పేదల నుండి సంవత్సరానికి చెత్త పన్ను 1440 రూపాయలు, మంచి నీటి చార్జీలు 2400 రూపాయలు, డ్రైనేజీ ఛార్జి 480 రూపాయలు, మొత్తం కలిపి 4320 రూపాయలు పేదల నుండి వసూలు చేస్తూ పేదలకు పన్ను లేదని చెప్పటం పచ్చి అబద్ధం కాదా ?

🚦పారదర్శకత, సమతుల్యత, అవినీతిని అరికట్టడం కోసం ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం చెప్పటం అర్ధరహితం.

🚨 కేంద్ర ప్రభుత్వ షరతులకు లోబడి రుణ పరిమితిని పెంచుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అని ఈ విధానాన్ని తెచ్చారు.

⛰️ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ప్రజలనెత్తిన ఈ భారం వేస్తున్నాయి.

🏠 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇంటి పన్నుల విధానాలు నిర్ణయిస్తే ఇక స్థానిక సంస్థల ఎందుకు? ఎన్నికలు ఎందుకు?

💰 గతంలో విజయవాడ నగర పాలక సంస్థలో వామపక్షాలు అధికారంలో ఉన్న సందర్భంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మంచి నీటి ఛార్జీలు పెంచమని ఆదేశించినా తిరస్కరించిన చరిత్ర ఉంది.

💰 అదే రీతిలో ఇప్పుడు విజయవాడ నగర పాలక సంస్థ వైయస్సార్ పార్టీ కార్పొరేటర్లు ఆస్తి విలువ ఆధారిత పన్ను ప్రతిపాదనలను తిరస్కరించి, ప్రజల పక్షాన నిలబడాలి.

📜లేనియెడల చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

✊ ప్రజా సంఘాలు, అసోసియేషన్లు, ప్రజలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులుపై ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదన ఉపసంహరించాలని ఒత్తిడి తేవాలి.

🚩 సిపిఎం కౌన్సిల్ లోపల, బయట ఈ భారంపై పోరాడుతుంది. ప్రజలకు అండగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.