*ఉమ్మడి పోరాటాలతో ఉధృతం.. *

సాగునీటి సంఘాల సమాఖ్య నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు.*


సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈ సంవత్సరం మేడే ను కార్మిక , కర్షక ప్రజా సమస్యలు వినదించే రోజుగా మేడే జరపాలని నిర్ణయించిన ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కార్యవర్గ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతులను వ్యవసాయాన్ని అలాగే దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని నాశనం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. మూడు తిరోగమన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయాన్ని, మతిమాలిన ప్రైవేటీకరణ తో ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలు, సహజ వనరులు , ఆరోగ్యం, విద్యా రంగం ఇలా అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని విమర్శించారు. మహమ్మారి కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వ అనాగరిక విధానాన్ని సమాజంలో ప్రజలు అందరూ ఖండించాలి అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా లేబర్ కోడ్స్, మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020 వెనక్కి తీసుకోవాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సి2+50% ఎం.ఎస్. పీ. ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ , కార్పొరేటీకరణ ఆపాలని , వినాశకరమైన ప్రస్తుత ద్వంద్వ వ్యాక్సిన్ విధానాన్ని రద్దు చేసి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫోటో క్యాప్షన్ : విజయవాడ రాష్ట్ర సమాఖ్య కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతున్న ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.